జగన్ సెక్యూరిటీపై హ్యూమన్ రైట్స్‌లో ఫిర్యాదు చేసిన లాయరు సాయికృష్ణ ఆజాద్

న్యూఢిల్లీ: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీపై ఓ లాయర్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు.జగన్‌కు రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ తగ్గించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిని ప్రభుత్వం కూడా కొట్టి పారేసింది. అయితే మంగళవారం సాయికృష్ణ ఆజాద్ అనే ఓ న్యాయవాది ఎన్‌హెచ్‌ఆర్సీని ఆశ్రయించారు. జగన్ సెక్యూరిటీపై ఆందోళన వెలిబుచ్చారు.   జెడ్ క్యాటగిరీలో ఉన్న మాజీ పార్లమెంటు సభ్యుడికి ప్రభుత్వం సెక్యూరిటీని తగ్గించిందని, ఆయన సెక్యూరిటీని ప్రభుత్వం వెంటనే పెంచాలని ఆయన కోరారు. ప్రభుత్వం సెక్యూరిటీ పునరుద్ధన చర్యలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కమిషన్‌ను కోరారు. Read more at: http://telugu.oneindia.com/news/2011/03/15/a-lawyer-complaint-against-government-150311-aid0108.html