సమాజ సేవలో ఆజాద్

నల్లకుంట: న్యాయం కోసం కోర్టు చుట్టూ తిరిగే పేదలకు ఆయన ఆపద్భాందవుడు. ప్రజా సమస్యలను విస్మరించే ప్రభుత్వాన్ని తట్టిలేపుతాడు. కళ్లముందు జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను నిలదీయడమే కాకుండా చట్టాలపై సామాన్యులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలను మేల్కొల్పుతున్నాడు. అతడే హైకోర్టు న్యాయవాది పూజల సాయికృష్ణ ఆజాద్. 12 ఏళ్ల క్రితం నల్లగొండ జిల్లా నుంచి నగరానికి వచ్చి నల్లకుంట శంకరమఠం సమీపంలో ఉంటున్నారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ లా ఫర్ సొసైటీ డాట్ కామ్ పేరిట ఓ వెబ్ సైట్‌ను ప్రారంభించి పేదలకు ఉచితంగా న్యాయ సలహాలు అందిస్తున్నాడు. అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన వారి కేసులను ఉచితంగా వాదిస్తూ న్యాయ సహాయం అందిస్తున్నారు. కొన్ని కేసుల్లో…